తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బ్రహ్మాస్త్ర'లో రణ్​బీర్ పాత్ర బహిర్గతం!

అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియాభట్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త’. ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్‌ కపూర్‌ పాత్ర లీకైందని సమాచారం.

By

Published : Apr 20, 2019, 9:53 PM IST

బ్రహ్మస్త్రకు లీకు సెగ....రణ్​బీర్ పాత్ర బహిర్గతం

భారీ తారాగణం, రూ. 200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'బ్రహ్మాస్త్ర'​. ఈ సినిమా శరవేగంగా షూటింగ్​ జరుపుకొంటోంది. అయితే ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చిత్ర నటుడు రణ్​బీర్​ పాత్ర బహిర్గతమైందన్న వార్త చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై స్పందించిన చిత్రబృందం కథమాత్రంలీకైంది కానీ సంబంధించిన ఫొటోలు, సమాచారమేదీ బహిర్గతం కాలేదని చెప్పుకుంటున్నారు.

  1. కథలో రణ్‌బీర్‌ 'డీజే' పాత్రలో కనిపించనున్నారట. ఇందులో తండ్రికి తనయుడికి మధ్య కొంత సంఘర్షణ జరుగుతుంది. నిజజీవితంలో ప్రేమికురాలైన ఆలియాభట్‌... సినిమాలోనూ రణ్‌బీర్‌కు ప్రేయసిగానే నటిస్తోందట.
  2. చిత్రానికి అయాన్​ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బుల్లితెర నటి మౌనీరాయ్‌ ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. తెలుగు కథానాయకుడు నాగార్జున ఇటీవల తెలుగు టీజర్​లో తన గాత్రంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఓ పాత్రలోనూ నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details