కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది మాజీ అందాల రాణి, నటి ఊర్వశి రౌతేలా. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్లో ఉంది. లాక్డౌన్లో ఇంటికే పరిమితం అవ్వటం బోర్ కొడుతుందంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె గడుపుతున్న ఒంటరితనానికి 'ఐసోలేషన్షిప్' అనే పేరు పెట్టింది. అందమైన రంగురంగుల బ్యాక్‌లెస్ దుస్తులలో ఉన్న ఫోటోను పంచుకుంది. దీనికి ఇన్స్టాలో 6 లక్షల 21వేల హార్ట్స్ లభించాయి.
'ఐసోలేషన్షిప్'లో నటి ఊర్వశి అందాలు - కొవిడ్-19 న్యూస్
కరోనా లాక్డౌన్ కారణంగా పలువురు సినీప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ ఆకర్షణీయమైన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.
'ఐసోలేషన్షిప్'లో నటి ఊర్వశి అందాలు
ఊర్వశి.. తన ఫొటోలతో అందాల ఆరబోత చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే బికినీతో ఉన్న ఓ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ బికినీ తనకిష్టమైందిగా కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ వేషధారణతో అనేక సార్లు పోస్ట్లు చేయటం వల్ల అదే ఆమెకు నచ్చి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి.. అమ్మతో హెడ్మసాజ్ చేయించుకుంటున్న కంగనా