భారీ అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ 'పెద్దన్న' పెద్దగా మెప్పించలేకపోయింది. మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వల్ల సినిమాల నుంచి విరామం తీసుకుంటారని అనుకున్నారు. కానీ, అందరూ ఆశ్చర్యపోయేలా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తలైవా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ క్రమంలో మరో వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
రజనీకాంత్ తన 170 సినిమా బోనీకపూర్ నిర్మాణ సంస్థలో చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బోనీకపూర్ స్పందించారు. 'ఎన్నో ఏళ్లుగా రజనీగారు నాకు స్నేహితులు. తరచూ మేము కలుస్తుంటాం. ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటాం. మేము కలిసి ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు ఆ ప్రకటన చేసే మొదటి వ్యక్తిని నేనే. ఈ విషయంలో మీకు ఎలాంటి ఊహాగాన వార్తలు ఉండవు' అని స్పష్టం చేశారు.