సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తికి బెయిల్ - సుశాంత్ సింగ్ రియా చక్రరర్తి
11:10 October 07
రియాకు బెయిల్.. ఆమె సోదరుడికి తిరస్కరణ
సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి రూ.లక్ష పూచీకత్తుతో, బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ముంబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రతి పదిరోజులకో ఓసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్లాలని స్పష్టం చేసింది. అయితే ఈమె సోదరుడు షోవిక్ బెయిల్‌ను మాత్రం తిరస్కరించింది.
సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌బీసీ) రంగంలోకి దిగి, ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. విచారణలో భాగంగా రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రా, దీపేష్ శావంత్, శామ్యూల్ మిరాండాలను అరెస్టు చేశారు.