తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​లో మరో ఆటో బయోగ్రఫీ.. ఈసారి సైఫ్​ వంతు - Saif Ali Khan book

హిందీ నటుడు సైఫ్​ అలీఖాన్​ తన అభిమానులకు మరో సర్​ప్రైజ్​​ ఇచ్చారు. తన జీవితంలోని పలు విషయాలతో ఆటో బయోగ్రఫీ రాస్తున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకం 2021లో విడుదల కానుంది.

Bollywood Star Saif Ali Khan Set To Pen His Autobiography, it will release on 2021
బాలీవుడ్​లో మరో ఆటో బయోగ్రఫీ.. ఈసారి సైఫ్​ వంతు

By

Published : Aug 25, 2020, 10:15 AM IST

బాలీవుడ్​లో స్వయంగా జీవితచరిత్రలను రాసుకునే ట్రెండ్​ మొదలైంది. ఇటీవలే ప్రియాంకా చోప్రా తన జీవితంలోని కొన్ని సంఘటనలతో 'అన్​ఫినిష్డ్'​ పేరిట ఓ పుస్తకాన్ని ముద్రిస్తున్నట్లు చెప్పింది. తాజాగా సైఫ్​ అలీఖాన్​ ఇదే జాబితాలో చేరారు. తన ఆటో బయోగ్రఫీని రాయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తన వ్యక్తిగత జీవితం సహా సినిమా విశేషాలు, కెరీర్​లోని ఎత్తుపల్లాలు, స్ఫూర్తి నింపిన వ్యక్తుల గురించి ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. హార్పర్​ కోలిన్స్​ సంస్థ ప్రచురించనున్న ఈ పుస్తకం.. 2021లో విడుదల కానుంది.

ఆదిపురుష్​లో ప్రభాస్​ ప్రత్యర్థిగా...

టాలీవుడ్​ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ఈ విషయమై జోరుగా చర్చ జరుగుతోంది. చెడుపై మంచిదే విజయం అనే కథతో దర్శకుడు 'ఓం రౌత్' ఈ సినిమా తీస్తున్నారు. అయితే 'ఓం రౌత్'​ తెరకెక్కించిన 'తాన్హాజీ'లో సైఫ్​ కీలక పాత్రలో కనిపించారు. అందుకే ఈ ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ సినిమాను నేరుగా తెలుగు, హిందీలో తెరకెక్కించి ఆపై తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. భూషణ్‌ కుమార్‌ సమర్పణలో గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ పతాకంపై.. కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌ రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details