Salman Khan: దక్షిణాది చిత్రాల్లో ఉండే హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆ హీరోయిజమే ప్రస్తుత హిందీ సినిమాల్లో కరవైంది చెప్పారు. 'వాంటెడ్', 'దబాంగ్' వంటి అనేక మాస్ మసాల చిత్రాలతో అలరించిన సల్మాన్.. ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
"బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిజంపై నమ్మకం ఉంచుతారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకో హీరో ఉంటాడు. కానీ, ఇక్కడ (బీటౌన్) ఒకరిద్దరు మినహా హీరోయిజం ఉన్న సినిమాలు తీయడంలేదు. అలాంటి సినిమాలు మూస అని భావిస్తున్నారు. అయితే హీరోయిజంతో పాటు భావోద్వేగాలుండటం చాలా ముఖ్యం."
-సల్మాన్ ఖాన్, బాలీవుడ్ హీరో
ఈ క్రమంలోనే దక్షిణాది రచయితలు, దర్శకుల.. ప్రతిభ, విజన్‌ను కొనియాడారు సల్మాన్. దక్షిణాది చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్న ట్రెండ్ మారాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. "మన కథలను కూడా వారు తీసుకునే రోజు రావాలి. దక్షిణాది రచయితలు చాలా కష్టపడతారు. అక్కడి దర్శకులు తీసే కాన్సెప్ట్ సినిమాలకూ ఆదరణ ఉంది" అని సల్మాన్ చెప్పారు.
ప్రస్తుతం 'టైగర్ 3'లో నటిస్తున్న సల్మాన్.. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్', షారుక్ 'పఠాన్' చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనపించనున్నారు. ఇటీవలే 'గాడ్‌ఫాదర్'లో కీలక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు సల్మాన్.
'గాడ్‌ఫాదర్' టీమ్‌తో సల్మాన్ చరణ్ పట్ల గర్వంగా ఉంది:"చిరంజీవి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఆయనతో పని చేయడం మంచి అనుభవం. చరణ్ కూడా నాకు స్నేహితుడే. 'ఆర్ఆర్ఆర్'లో అద్భుతంగా నటించాడు. చరణ్ పట్ల గర్వంగా ఉంది. అయితే వారి సినిమాలు ఇక్కడ నడుస్తాయి గానీ మనవి (హిందీ) అక్కడ ఎందుకని ఆడవు?" అని సల్మాన్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:'గాడ్‌ఫాదర్' సల్మాన్ షెడ్యూల్ పూర్తి.. 'బజరంగి భాయిజాన్' సీక్వెల్ అప్డేట్