తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ సింగ్ మరణ వార్త షాక్​కు గురిచేసింది' - 'ధోనీ' ఫేం సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య

సుశాంత్
సుశాంత్

By

Published : Jun 14, 2020, 2:32 PM IST

Updated : Jun 14, 2020, 5:07 PM IST

16:53 June 14

సచిన్ తెందూల్కర్

సుశాంత్‌ లేరన్న వార్త షాక్‌కు గురి చేసింది. అద్భుతమైన నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

16:52 June 14

పీయూష్ గోయల్

సుశాంత్‌ లేరన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డా. ప్రతిభ కలిగిన యువ నటుడైన సుశాంత్‌ తన నటన ఛరిష్మాతో వెండితెరపై మేజిక్‌ చేశారు.

16:50 June 14

సోనూసూద్

నా హృదయం ముక్కలైంది. నా నోటివెంట మాటలు రావడం లేదు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా.

16:38 June 14

ఊర్మిలా

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మరణవార్త ఎంతో బాధ కలిగించింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

16:35 June 14

అజయ్ దేవగణ్​

సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాధ కలిగించింది. ఇది ఎంతో విషాదకరమైన వార్త. అతడి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా. 

16:13 June 14

డేవిడ్ వార్నర్

సుశాంత్ మరణవార్త చాలా బాధను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

16:05 June 14

ప్రధాని మోదీ

మంచి భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ చాలా తొందరగా తనువు చాలించారు. టీవీ, సినిమాల్లో నటనతో మెరిశాడు. ప్రపంచ వినోద రంగంలో మరపురాని నటనతో ఎందరికో స్ఫూర్తినింపారు. సుశాంత్ మరణవార్త షాక్​కు గురిచేసింది. అతడి కుటంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి. 

15:38 June 14

రవిశాస్త్రి

ఈ విషాద వార్త విని షాక్​కు గురయ్యా. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా మరణించడం బాధాకరం. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.  

15:36 June 14

అనిల్ కుంబ్లే

సుశాంత్ మరణ వార్త విని షాక్​కు గురయ్యా. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. చాలా ప్రతిభ గల నటుడు తొందరగానే మనల్ని వీడి వెళ్లిపోయాడు.

15:33 June 14

రామ్​గోపాల్ వర్మ

బాలీవుడ్​ ఇప్పటివరకు ఎరుగని షాకింగ్ వార్త ఇది. యువకుడు, ఇంకా ఎంతో భవిష్యత్ మిగిలి ఉంది. అయినా ఎందుకు?

15:31 June 14

కీర్తి సురేశ్

షాకింగ్. మాటలు రావట్లేదు. ఎంతో ప్రతిభ గల యువ నటుడు ఇక లేరని తెలిస్తే నమ్మలేకపోతున్నా.

14:58 June 14

ప్రియమణి

ఈ వార్త చాలా షాక్​కు గురిచేసింది.

14:58 June 14

అక్షయ్ కుమార్

సుశాంత్​ మృతి నన్ను షాక్​కు గురిచేసింది. 'చిచోరే' సినిమా చూసిన తర్వాత నా స్నేహితుడు, నిర్మాత సాజిద్​కు ఫోన్ చేసి ఆ పాత్ర నేను చేస్తే బాగుండేదని చెప్పా. చాలా ప్రతిభ గల నటుడు సుశాంత్.

14:58 June 14

14:54 June 14

సుశాంత్ మృతిపై పలువురి సంతాపం

సుశాంత్ సింగ్ ఆత్మహత్య షాక్​కు గురిచేసిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో సంతాపం తెలుపుతున్నారు.

14:29 June 14

నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య

ధోనీతో సుశాంత్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 'ధోనీ' సినిమాలో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఇటీవలే తనకు మేనేజర్​గా పనిచేస్తున్న దిశా శాలిన్ కూడా సూసైడ్ చేసుకోవడం గమనార్హం.

Last Updated : Jun 14, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details