తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్‌ నటి - cine news

వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్‌ నటి
వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్‌ నటి

By

Published : Feb 14, 2022, 6:21 PM IST

18:10 February 14

వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్‌ నటి

తన ఏడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి బుల్లితెర వ్యాఖ్యాత, నటి, డ్యాన్సర్‌గా బాలీవుడ్‌తోపాటు, దక్షిణాదిలోనూ ప్రేక్షకుల్ని అలరించారు ఈ తార. ఓ ఎన్నారైతో తన వివాహమైందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆమె గతేడాది బిగ్‌బాస్‌ షో వేదికగా తన భర్త రితేష్‌ సింగ్‌ని మొదటిసారి అందరికీ పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే రితేష్‌ నుంచి విడిపోతున్నట్లు ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. వాలంటైన్స్‌ డే ముందు ఇలాంటి ప్రకటన చేయడం ఎంతో బాధగా ఉందని ఆమె తెలిపింది.

‘‘రితేష్‌, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా దారులు మేం చూసుకోవాలనుకుంటున్నాం. బిగ్‌బాస్‌ షో తర్వాత మా జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని విషయాలు నాకు తెలియకుండానే నా చేజారిపోయాయి. మా మధ్య తలెత్తిన విభేదాలను తొలగించుకుని, కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, చివరికి విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయం అనిపించింది. వాలంటైన్స్‌ డే ముందు ఇలా జరగడం నాకెంతో బాధగా ఉంది. రితేష్‌ మంచి వాడే. అయినప్పటికీ ప్రస్తుతానికి నా దృష్టంతా కెరీర్‌, జీవితంపైనే పెట్టాలని, సంతోషంగా జీవించాలని ఉంది’’ అని రాఖీ సావంత్‌ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details