'ఎవెంజర్స్' లాంటి సూపర్ హీరోలను పరిచయం చేసిన మార్వెల్ సంస్థ.. ప్రస్తుతం 'బ్లాక్ విడో' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. కానీ, అమెరికా కంటే ఓ రోజు ముందుగానే భారత్‌లో సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ 30న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అభిమానులను అలరించనుంది.
తెలుగులో ఓ రోజు ముందుగా 'బ్లాక్ విడో' సర్ప్రైజ్ - స్కార్లెట్ జాన్సన్
సూపర్ హీరోల సృష్టికర్త మార్వెల్ సంస్థ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందించిన 'బ్లాక్ విడో' చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనుంది. ఈ సినిమా అమెరికాలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ రోజు ముందుగా అభిమానులను పలకరించనుంది.
భారత్‌లో ఒక రోజు ముందుగానే 'బ్లాక్ విడో'
మార్వెల్ కామిక్స్ నుంచి తెరకెక్కుతోన్న 24వ చిత్రమిది. కేట్ షార్ట్లాండ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఎరిక్ పీటర్సన్ దీన్ని నిర్మించాడు. ఇందులో స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పుగ్, డేవిడ్ హార్బర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి.. ఫస్ట్‌లుక్: బాక్సింగ్ ఛాంపియన్ 'హవాసింగ్' బయోపిక్
Last Updated : Feb 29, 2020, 6:43 AM IST