తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2022లో థియేటర్లకు 'బ్లాక్ పాంథర్' సీక్వెల్ - black panther

'బ్లాక్ పాంథర్​ 2' విడుదల తేదీ ఖరారైంది. 2022 మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

బ్లాక్ పాంథర్

By

Published : Aug 25, 2019, 11:34 AM IST

Updated : Sep 28, 2019, 4:57 AM IST

హాలీవుడ్​లో బిలియన్ డాలర్ బ్లాక్​బాస్టర్​గా నిలిచిన 'బ్లాక్ పాంథర్' చిత్రానికి సీక్వెల్​ రూపొందుతోంది. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన ర్యాన్ కూగ్లర్​ ఈ సినిమాకూ డైరెక్టర్​గా వ్యవహరించనున్నాడు. మార్వెల్ స్డూడియోస్​ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 2022 మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది.

"ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ప్రేక్షకుల కోసం మరిన్ని ప్రత్యేకతలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సీక్వెల్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు".
-కూగ్లర్, దర్శకుడు

ఈ చిత్రంలో బోస్​మన్, మైఖెల్ బి జోర్డాన్, లుపిటా యంగ్, గురిరా, డేనియల్ కలూయా, లెటిట రైట్, విన్​స్టన్ డ్యూక్, ఆంజెలా బాసెట్, ఫారెస్ట్ విట్టేకర్, మార్టిన్ ఫ్రీమన్ తదితరులు నటిస్తున్నారు.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన 'బ్లాక్ పాంథర్' అకాడమీ అవార్డుకు నామినేటై.. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

ఇవీ చూడండి.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ... నిజమేనా..?

Last Updated : Sep 28, 2019, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details