Nagarjuna Bigg Boss 5: సినిమా స్టార్స్ అనుకరణ టాస్క్‌లో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో శ్రీదేవిగా చేసిన కాజల్‌కు ఓటు అడిగే అవకాశం లభించింది. దీంతో ఆమె ఎమోషనల్ అయింది. "నా పెర్ఫామెన్స్ నచ్చి, ఇంత దూరం తీసుకొచ్చారు. మొదటి రోజు నుంచి అందరూ చూస్తున్నారు. నేను కొంచెం నచ్చినా ఓటు వేయండి. బిగ్‌బాస్‌కు రావడం నా డ్రీమ్. అది నెరవేరింది. నా ఫ్రెండ్స్‌తో కలిసి టాప్-5లో ఉండాలనుకుంటున్నా" అని కాజల్ ఓటు అప్పీల్ చేసింది. ఆ తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఇంటి సభ్యులు సమాధానం చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. నిజాయతీగా సమాధానం చెప్పిన వ్యక్తికి ఓటు అడిగే అవకాశం లభిస్తుందని అన్నాడు. ఆ తర్వాత ఒక్కో ప్రశ్నను టెలివిజన్ స్క్రీన్‌పై డిస్ప్లే చేయడం వల్ల హౌస్మేట్స్ వాటికి సమాధానం ఇచ్చారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నీ అందులో ఉన్నాయి. అవే ఈ ప్రశ్నలు..
మీరు షణ్ముఖ్ కన్నా బలమైన ప్లేయర్. కానీ, మిమ్మల్ని మీరు ఎందుకలా గుర్తించుకోవటం లేదు?
సిరి: నేను బలమైన ప్లేయర్‌నని ఒప్పుకుంటా. కానీ, నేను హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నా. ఆ సమయంలో షణ్ముఖ్ నాకు అండగా నిలిచాడు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తా. షణ్ముఖ్‌తో నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. నాకన్నా పైస్థానంలో షణ్ముఖ్‌ను చూడాలనుకుంటున్నా.
అనీ మాస్టర్‌తో మర్యాద గురించి మాట్లాడిన మీరు, తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం మర్యాద అనిపించుకుంటుందా?
కాజల్: గొడవలో అనీ మాస్టర్‌తో వివాదం జరిగింది. సన్నీతో ఉన్న చనువుతోనే అలా చేశా. సన్నీ అంటే నాకు చాలా మర్యాద. అయితే, కాస్త చనువు ఎక్కువ.
గిల్టీ బోర్డు వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సంఘటన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా తిరిగి పొందారు?
సన్నీ:గిల్టీ బోర్డు వేసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుపట్టను. ఆ సమయంలో నేను కోపంతో ఉన్నా. కొన్ని మాటలు విన్న తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. జనాల నుంచి వచ్చిన ధైర్యం, వీకెండ్స్‌లో నాకు వచ్చిన అభినందనలు నాలో కాన్ఫిడెన్స్ నింపాయి. అదే నన్ను ముందుకు నడుపుతోంది. నన్ను నేను అద్దంలో చూసుకుని ‘కమాన్ సన్నీ’ అనుకుంటున్నా.
జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ముఖ్ పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పారు. కానీ, ర్యాంకింగ్స్ టాస్క్‌లో మీరే షణ్ముఖ్ పరిపూర్ణ వ్యక్తి అని అతనిని 2వ స్థానంలో నిలబెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ముఖ్ గ్రూప్‌లో ఉన్నారా?
శ్రీరామ్: నేను ఏ గ్రూప్‌లోనూ లేను. జెస్సీతో గొడవ జరిగినప్పుడు షణ్ముఖ్‌తో పెద్దగా పరిచయం లేదు. అప్పుడు నేను రెండు వైపుల స్టోరీ తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేది. సమయంలో తను ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిన షణ్ముఖ్ వేరు. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ మొదలైంది. అందుకే పరిపూర్ణత వచ్చిన వ్యక్తిగా కనిపించడం వల్ల 2వ స్థానంలో పెట్టా.
ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడు. మీకు అనిపించటం లేదా?
మానస్: ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడన్నది సరైన ఆలోచన కాదు. ఈ జర్నీలో మా మధ్య అనుబంధం పెరుగుతూ వెళ్లింది. ఆ ఆలోచన రాలేదు. నిజాయతీగా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత విలువ ఇస్తాడో, వాళ్లను సేవ్ చేసినప్పుడు సన్నీ రియాక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకరిని వాడుకుని పైకి రావాలన్న మనస్తత్వం సన్నీకి ఎప్పుడూ లేదు. నాకూ లేదు. నాకెప్పుడూ అలా అనిపించదు. ఒకవేళ మీకు అనిపిస్తే ఆ ఆలోచన మార్చుకోండి.
సిరి అంటే మీరెందుకు సొంత వ్యక్తిలా ఫీలవుతారు. మీరు సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? ఆమెను తనలా ఎందుకు ఉండనివ్వరు?
షణ్ముఖ్:ఈ ప్రశ్న వస్తుందని నేను అనుకున్నా. నా సొంత వ్యక్తిలా భావిస్తున్నానని నాకూ తెలుసు. కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తే బాగుంటుందని, ఇంకొన్ని విషయాల్లో తనని వదిలేస్తే బాగుంటుందని అనుకున్నా. ఇక్కడే కాస్త తికమకపడ్డా. ఆ క్రమంలో ఆమెపై కొన్నిసార్లు అరిచాను. నాకన్నా తనే నన్ను అర్థం చేసుకుంది. పూర్తి పరిపక్వత చెందిన వ్యక్తి. గేమ్‌లో ఆమెను ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు. బయట ఎవరైతే ఆమె మీద గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ సమయంలో కంట్రోల్ చేస్తాను. ఆమెను టాప్-5లో చూడాలనుకుంటున్నా!