తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు 'భోళా శంకర్' షూటింగ్ షురూ.. 'ఛలో ప్రేమిద్దాం' ట్రైలర్ - sampoornesh babu new movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భోళా శంకర్, అహమ్ రీబూట్, ఛలో ప్రేమిద్దాం, అనుభవించు రాజా, క్యాలీఫ్లవర్, కాతువకుల రెండు కాదల్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్

By

Published : Nov 15, 2021, 9:03 PM IST

*మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'(bhola shankar movie) షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చిత్రబృందం చెప్పింది. డైరెక్టర్ మోహర్​ రమేశ్(meher ramesh chiranjeevi), నిర్మాత రామబ్రహ్మం ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది.

.
.

ఇందులో చిరు(chiranjeevi movies) సోదరిగా కీర్తి సురేశ్(keerthy suresh movies) నటిస్తోంది. హీరోయిన్​గా తమన్నా(tamanna bhatia new movie) చేస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్​ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

*సుమంత్ హీరోగా కొత్త సినిమా(sumanth new movie telugu) ప్రారంభమైంది. సోమవారం నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని చెబుతూ ప్రీలుక్​ పోస్టర్​ను రిలీజ్ చేశారు. 'అహమ్ రీబూట్' టైటిల్​ను ఖరారు చేశారు. తన గురించి తాను తెలుసుకోవడం.. అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

.

*'కాతువక్కుల రెండు కాదల్' సినిమా(kathuvakkula rendu kadhal release date) నుంచి నయనతార ఫస్ట్​లుక్​ను కూడా రిలీజ్ చేశారు. కన్మణి అనే రోల్​లో ఆమె కనిపించనుంది. అంతకు ముందే సమంత(కతిజా)(samantha akkineni movies), విజయ్ సేతుపతి(రాంబో) ఫస్ట్​లుక్స్​ను కూడా విడుదల చేశారు. ట్రైయాంగిల్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్(anirudh ravichander songs) సంగీతమందిస్తున్నారు. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

.

*'ఛలో ప్రేమిద్దాం' చిత్ర ట్రైలర్​ను(chalo premiddam trailer ) సోమవారం రిలీజ్ చేశారు. సాయి రోనక్, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రాన్ని త్వరలో థియేటర్లలోకి తీసుకురానున్నారు. సురేశ్ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

*రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' సినిమా(anubhavinchu raja movie raj tarun) ట్రైలర్​ను నవంబరు 17న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కషిష్ ఖాన్ హీరోయిన్. గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. నవంబరు 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీనితో పాటే సంపూర్ణేశ్​ బాబు 'క్యాలీఫ్లవర్'(sampoornesh babu new movie) చిత్ర టీజర్​ను మంగళవారం(నవంబరు 16) ఉదయం 11:07 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు.

.
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details