తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీష్మ'లో సక్సెస్​ఫుల్​ హీరోయిన్​తో నితిన్ - tollywood

సరైన విజయాలు లేక ఇబ్బందిపడుతున్న హీరో నితిన్​ ఓ హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు. తాజాగా భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది.

'భీష్మ'లో సక్సెస్​ఫుల్​ హీరోయిన్​తో నితిన్

By

Published : Apr 18, 2019, 7:14 AM IST

సినిమాలకు కాస్త విరామం తీసుకున్న నితిన్ తాజాగా 'భీష్మ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటించనుంది. ఛలో ఫేం వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్​మెంట్స్​ బ్యానర్‌ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

  • భీష్మ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తుందని ఇదివ రకే ప్రకటించింది చిత్రబృందం. కానీ ఈ సినిమాలో మరో హీరోయిన్‌ ఉందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలపై స్పష్టత ఇచ్చాడు దర్శకుడు వెంకీ . భీష్మలో ఒకే హీరోయిన్‌ ఉంటుందని ఆ పాత్రకు రష్మికనే ఎంపిక చేసినట్టు ట్వీట్​ చేశాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details