తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకనైనా రోడ్లపై పడుకోకుండా ఇంటికి పో... స్వీట్ వార్నింగ్ - పూజ హెగ్డే కోసం ముంబయి వెళ్లిన భాస్కర్ రావు

హీరోయిన్​ పూజాహెగ్డే కోసం ఓ అభిమాని ఏకంగా ముంబయికి వెళ్లాడు. ఐదు రోజుల పాటు ఫుట్​పాత్​పై పడుకుని ఆమె కోసం ఎదురుచూశాడు. తాజాగా అతడిని పలకరించిన పూజ.. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

pooja hegde
పూజ

By

Published : Jan 15, 2020, 4:13 PM IST

Updated : Jan 16, 2020, 3:40 PM IST

హీరోహీరోయిన్లకు అభిమానులు ఉండటం సహజమే. కొన్నిసార్లు ఈ అభిమానమే హద్దులు దాటుతుంటుంది. ఆరాధ్య నటుల కోసం కొన్నిసార్లు శ్రుతిమించిన పనులు వేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యక్తే.. హీరోయిన్ పూజా హెగ్డే కంటపడ్డాడు. అతడు ఈమె కోసం ఏకంగా ఐదు రోజులు ఫుట్​ఫాత్​పై పడుకొని ఎదురుచూశాడంటే మీకు ఆశ్చర్యం కలగకమానదు.

భాస్కర్​రావు.. హీరోయిన్​ పూజా హెగ్డేను చూసేందుకు ముంబయి వెళ్లాడు. అక్కడ ఆమె కోసం ఐదు రోజులు ఎదురుచూశాడు. ఫుట్​పాత్​పై పడుకుని కాలం గడిపాడు. పూజ తనను చూసిపలకరించగానే మురిసిపోయాడు. జరిగిన విషయాన్ని ఆమె​కు వివరించాడు. అభిమానిని పలకరించిన పూజ.. ఇలాంటి పనులు మరోసారి చేయొద్దని స్వీట్​ వార్నింగ్​ ఇచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది.

ఇవీ చూడండి.. 'గంగూబాయ్​' పాత్రలో మెప్పిస్తోన్న ఆలియా

Last Updated : Jan 16, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details