తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆసక్తికరంగా ఓ పేద జంట ప్రేమకథ..! - rgv

రామ్​గోపాల్​వర్మ కలల ప్రాజెక్టుగా అగస్త్య మంజూ తెరకెక్కిస్తున్న 'బ్యూటిఫుల్' చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. సూరి, నయన గంగూలీ హీరోహీరోయిన్లు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ట్రైలర్ బ్యూటీఫుల్​

By

Published : Oct 9, 2019, 5:55 PM IST

రామ్​గోపాల్ వర్మ సూపర్ హిట్ చిత్రం 'రంగీలా' స్ఫూర్తితో తెరకెక్కుతోన్న సినిమా 'బ్యూటిఫుల్​'​. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. సూరి, నయన గంగూలీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఆర్జీవీ కలల ప్రాజెక్టుగా రూపొందిస్తున్న ఈ సినిమాకు అగస్త్ మంజూ దర్శకుడు.

మూడు నిమిషాల వ్యవధి ఉన్న ట్రైలర్​లో మాటలు లేవు. కైవలం నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది చిత్రబృందం. ఈ రొమాంటిక్ ప్రేమ కథగాలో...​ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్​లో ఉండబోతోందని సమాచారం.

హీరోహీరోయిన్​ ఒకరినొకరు ప్రేమించుకుని డబ్బు కారణంగా విడిపోయారనే అంశం ప్రధానంగా చూపించారు. ప్రేమికుల మధ్య అలా ఎందుకు జరిగిందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

టైగర్‌ కంపెనీ పొడ్రక్షన్‌ పతాకంపై టి.నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షేక్‌ యూసఫ్‌ సహ నిర్మాత. రవి శంకర్‌ బాణీలు సమకూర్చాడు. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: భూతవైద్యుడు షూటింగ్ ప్రారంభించాడు..!

ABOUT THE AUTHOR

...view details