తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా 'ఒక్కడు' అనే టైటిల్​ వచ్చింది! - okkadu movie

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'ఒక్కడు' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్ర టైటిల్​ విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన తర్వాతే ఈ పేరు నిర్ణయించారట.

behind The scene confirmation of mahebabu's okkadu movie Title
అలా 'ఒక్కడు' అనే టైటిల్​ వచ్చింది!

By

Published : Jan 22, 2020, 5:21 PM IST

Updated : Feb 18, 2020, 12:17 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'ఒక్కడు'లో ప్రతీ పాత్ర సినిమాకు ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చింది. విలన్​గా ప్రకాశ్​రాజ్​, కథానాయికగా భూమిక తదితరులు తమ నటనతో మెప్పించారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కొండారెడ్డి బురుజు, చార్మినార్​ సెట్​, మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతంతో సహా అన్నీ ఓ అద్భుతమే.

క్రీడా నేపథ్యంలో మహేశ్​బాబుతో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు గుణశేఖర్​. నిర్మాత, హీరోయిన్​, ఆర్ట్​ డైరెక్టర్​, సంగీత దర్శకుడు, మాటల రచయిత... ఇలా ఈ సూపర్ హిట్​ చిత్రానికి కావాల్సిన ముడిసరుకు సిద్ధమైంది. ఇక మిగిలింది టైటిల్​ మాత్రమే. ముందుగా 'అతడే ఆమె సైన్యం' అనే పేరు అనుకుంది చిత్రబృందం. కానీ, అప్పటికే ఈ టైటిల్​ రిజిస్టర్​ అయింది. ఈ పేరు కోసం గుణశేఖర్​ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్ల మరో పేరు పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 'కబడ్డీ' అని పెట్టాలనుకున్నారు. అప్పటికీ సంతృప్తిపడక, మరో పేరును అన్వేషించారు. చివరకు 'ఒక్కడు'గా ఖరారు చేశారు. ఈ సినిమా ప్రిన్స్​ కెరీర్​ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికీ బుల్లితెరపై ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం.

ఇదీ చూడండి.. మైమరిపిస్తున్న పాయల్​ అందాలు

Last Updated : Feb 18, 2020, 12:17 AM IST

ABOUT THE AUTHOR

...view details