'దేవదాసు' సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో రామ్. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దేవదాస్ కంటే ముందు వేరే చిత్రంతో రామ్ పరిచయం అవ్వాల్సిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన యువసేన. ఆ సినిమాలో రామ్‌కు తొలి అవకాశం వచ్చిందట.
'యువసేనై' రావాల్సింది.. 'దేవదాసు'గా వచ్చాడు - ఇస్మార్ట్ శంకర్ సినిమా వార్తలు
టాలీవుడ్ హీరో రామ్.. 'దేవదాసు'తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దేవదాసు కంటే ముందు రామ్ వేరే చిత్రంతో పరిచయం కావాల్సిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
'యవసేనై' రావాల్సింది.. 'దేవదాస్'గా వచ్చాడు
ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్ 'యువసేన' చిత్ర తెలుగు రీమేక్ హక్కులు సొంతంచేసుకుని... రామ్‌ను కథానాయకుడిగా ఎంపిక చేద్దామకున్నాడట.అప్పుడే దర్శకుడు వైవీఎస్ చౌదరి.. నూతన నటీనటులతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఓ రోజు స్రవంతి రవికిశోర్ కార్యాలయంలో రామ్ నటించిన ఓ లఘుచిత్రం చూసి తన కొత్త సినిమాలోహీరోగా ఎంపిక చేసుకున్నాడటవైవీఎస్. అందుకు రవి కిశోర్ కూడా ఒప్పుకోగా... రామ్ యువసేన సినిమా బదులు దేవదాసుతో అరంగేట్రం చేశాడు.