తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇన్‌స్టాలోకి బండ్ల ఎంట్రీ.. తొలి పోస్ట్​ వైరల్​ - బండ్ల గణేశ్​

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇన్​స్టా ఖాతాను తెరిచారు. ఇందులో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఫొటోను మొదటగా పోస్ట్​ చేశారు. ఆ ఫొటో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.

bandla
బండ్ల

By

Published : Apr 25, 2021, 8:06 PM IST

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ఆదివారం ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. ఇకపై తనని ఇన్‌స్టాలో సైతం ఫాలో కావొచ్చని పేర్కొంటూ ఓ ట్వీట్‌ కూడా పెట్టారు. కాగా, ఆయన ఇన్‌స్టాలో ఇప్పటివరకూ మూడు ఫొటోలు షేర్‌ చేశారు. అందులో ముఖ్యంగా ఆయన షేర్‌ చేసిన మొదటి ఫొటో ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అది మరెమిటో కాదు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫొటో. ఇటీవల జరిగిన 'వకీల్‌సాబ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దిగిన పవన్‌ ఫొటోని ఆయన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. బండ్ల గణేష్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ ఎంతో ఆకర్షిస్తోంది.

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని బండ్ల గణేష్‌ పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇటీవల 'వకీల్‌సాబ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న బండ్ల.. 'ఈశ్వరా పవరేశ్వరా పవనేశ్వరా' అంటూ పవన్‌కల్యాణ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అంతేకాకుండా బండ్ల స్పీచ్‌ సైతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ప్రథమస్థానంలో నిలిచిన విషయం విదితమే.

ABOUT THE AUTHOR

...view details