తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bandla Ganesh: హీరోగా బండ్ల గణేశ్.. షూటింగ్ మొదలు - బండ్ల గణేష్ సినిమా

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్.. హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సింగిల్​ షెడ్యూల్​లోనే ఈ చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

bandla ganesh
బండ్ల గణేష్

By

Published : Sep 5, 2021, 5:30 AM IST

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెంకట్ చంద్ర దర్శకుడు. తమిళంలో పార్తిబన్‌ నటించిన 'ఒత్త సెరుప్పు సైజ్‌7'కి తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ ఈ మధ్యే మొదలైంది.

హీరోగా బండ్ల గణేష్

ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తమిళ హిట్ 'ఒత్త సెరుప్పు సైజ్ 7'లో ఆర్.పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేశ్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని అన్నారు.

రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌

ఇదీ చూడండి:"టక్​ జగదీష్​' ఓటీటీ రిలీజ్​కు కారణమదే'

ABOUT THE AUTHOR

...view details