తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హిట్‌ రీమేక్‌లో హీరోగా బండ్ల గణేశ్‌! - బండ్ల గణేష్ న్యూస్

బండ్ల గణేష్​ ఓ కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ తమిళ హిట్ చిత్రం​ రీమేక్​తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

bandla ganesh
బండ్ల గణేష్

By

Published : Aug 20, 2021, 5:46 PM IST

నటుడు బండ్ల గణేశ్‌ త్వరలో ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా, చివరకు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్రవేసిన ఆయన త్వరలో కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంతకీ బండ్ల గణేశ్‌ కథానాయకుడిగా నటించే చిత్రమేంటో తెలుసా? తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఒత్త సెరుప్పు అళవు7'(సింగిల్‌ స్లిప్పర్‌ సైజ్-7) పార్తిబన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పార్తిబన్‌. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో అభిషేక్‌ బచ్చన్‌ రీమేక్‌ చేస్తున్నాడు. కాగా, తెలుగులో బండ్ల గణేశ్‌ ఈ క్యారెక్టర్‌ పోషించనున్నాడు.

ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబరు మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:Bandla ganesh: 'వాళ్లకు పెన్​తో కిక్​.. నాకు మైక్​ ఉంటే కిక్​!'

ABOUT THE AUTHOR

...view details