ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో సందడి చేసిన నందమూరి నటసింహం బాలకృష్ణ... కేఎస్‌రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకొంటోంది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఓ షెడ్యూల్ పూర్తయింది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య స్టిల్ బయటకు వచ్చింది. ఫ్రెంచ్లుక్తో వినూత్నంగా కనిపిస్తున్న బాలకృష్ణను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా మరో పోస్టర్ బయటకు వచ్చింది.