'క్రాక్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు గోపీచంద్ మలినేని. ఆయన సొంత కథతోనే ఆ సినిమాను తీసి సత్తా చాటారు. తదుపరి బాలకృష్ణతో ఆయన పనిచేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం కూడా గోపీచంద్ సొంతంగా కథను సిద్ధం చేసుకున్నారు.
బాలకృష్ణతో గోపీచంద్ సినిమా.. 'క్రాక్' తరహాలోనే - balakrishna gopichand
బోయపాటితో సినిమా చేస్తున్న బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత నటించనున్నారు. దీనిని నిజజీవిత సంఘటన ఆధారంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణతో గోపీచంద్ సినిమా.. 'క్రాక్' తరహాలోనే
'క్రాక్' తరహాలోనే ఈసారీ నిజజీవిత సంఘటనలతో ఆయన కథను సిద్ధం చేసినట్టు సమాచారం. కథనం, యాక్షన్ ఘట్టాలపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. 'క్రాక్' చిత్రానికి అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేలోనే బాలకృష్ణతో సినిమా పట్టాలెక్కనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమవుతోంది.
ఇది చదవండి:రామ్ కొత్త సినిమా.. తమిళ ప్రముఖ దర్శకుడితో