తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్ రీస్టార్ట్.. సెట్​లోకి బాలయ్య - బాలకృష్ణ బోయపాటి సినిమా

బోయపాటి-బాలకృష్ణ కాంబోలో తీస్తున్న సినిమా షూటింగ్.. ఏడు నెలల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఫేస్​బుక్ వేదికగా పంచుకున్నారు దర్శకుడు.

balakrishna boyapati movie shooting re start on thursday
షూటింగ్ రీస్టార్ట్.. సెట్​లోకి బాలయ్య

By

Published : Oct 29, 2020, 11:32 AM IST

నందమూరి బాలకృష్ణ.. చాలా నెలల తర్వాత తిరిగి సెట్​లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం నుంచి తమ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు బోయపాటి శ్రీను, ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టారు.

దర్శకుడు బోయపాటి శ్రీను ఫేస్​బుక్ పోస్ట్

మార్చిలోనే ఈ సినిమా షూటింగ్​ మొదలైంది. ఓ ఫైట్ ఎపిసోడ్​ను తీశారు. ఆ తర్వాత లాక్​డౌన్​ విధించడం వల్ల ఎక్కడికక్కడే చిత్రీకరణ నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభమైంది. దీనికి తమన్ సంగీత దర్శకుడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details