కరోనా ఉద్ధృతి తగ్గడం వల్ల చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి(Balakrishna-Boyapati) హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ'(Akhanda) చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరగడం వల్ల చిత్రీకరణ తుదిదశలో ఉన్నప్పుడు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
Balakrishna: ఆ పండగ కానుకగా 'అఖండ' - అఖండ లేటెస్ట్ న్యూస్
కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలి ఉన్న షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి వినాయక చతుర్థి కానుకగా, సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. ఈ వినాయక చతుర్థి కానుకగా, సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంగది. మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు.
ఇదీ చూడండి: Balakrishna: 'అఖండ'.. జులై నుంచి హైదరాబాద్‌లో!