బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికి తెలిసిందే. కొవిడ్ సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లకు పూర్వవైభవాన్ని తెచ్చిన చిత్రంగా నిలిచింది. అఖండ విజయవంతంగా ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకుంది. అయితే.. జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలోకి వచ్చి 24గంటలు గడవకముందే.. 1మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది.
ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. ప్రగ్యాజైశ్వాల్ కథానాయిక. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.