Akhanda 100 Days Function: భారతీయ సినిమాకు దిక్సూచి వంటిది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అని అన్నారు చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. కరోనా సమయంలో విడుదలై ఇతర సినిమాలకూ భరోసా ఇచ్చిందని చెప్పారు. 100రోజుల, 200రోజుల సినిమా కనుమరుగవుతున్న తరుణంలో శతదినోత్సవ ఫంక్షన్ జరుపుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఈమేరకు వ్యాఖ్యానించారు రవీందర్ రెడ్డి.
మంచి మనసున్న హీరో..
బాలయ్య మంచి మనసున్న హీరో అని అన్నారు నటుడు శ్రీకాంత్. ఆ విషయం చెప్పేందుకు గర్వపడతానని అన్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్యతో కలిసి నటించడం ఎంతో సంతోషానిచ్చిందని తెలిపారు. సినిమాలోని అదిరిపోయే డైలాగ్ చెప్పి అలరించారు.
కొవిడ్ రెండో దశ తర్వాత విడుదలై.. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన చిత్రంగా బాలకృష్ణ 'అఖండ' నిలిచింది. గతేడాది డిసెంబరు 2.. విడుదలైన తొలిరోజు నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతూ.. ఇతర పెద్ద చిత్రాల విడుదలకు భరోసానిచ్చింది. మాస్ ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు.. వీటన్నింటినీ మించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మాస్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. బాలయ్య కెరీర్‌లో తొలిసారి రూ.100కోట్లు సాధించిన చిత్రంగా 'అఖండ' రికార్డు సృష్టించింది.
ఇదీ చూడండి:NBK 107: సిరిసిల్లలో షూటింగ్ మొదలుపెట్టిన బాలయ్య