తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య పుట్టినరోజున అభిమానులకు సర్​ప్రైజ్​! - బాలయ్య పుట్టినరోజు అభిమానులకు సర్​ప్రైజ్​!

ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. తన 106వ సినిమాకు సంబంధించి కొత్త టైటిల్​, ఫస్ట్​లుక్​ సహా ఓ పాటను చిత్రబృందం విడుదల చేయనున్నట్లు టాక్​. ఈ పాటను స్వయంగా బాలయ్య ఆలపించడం విశేషం. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

Balakrishna
బాలయ్య

By

Published : Jun 2, 2020, 6:32 PM IST

నందమూరి అభిమానులు, సినీప్రియులకు తన జన్మదినం సందర్భంగా అదిరిపోయే కానుక అందించబోతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఈనెల 10న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు తన కొత్త చిత్రం నుంచి ఓ కానుకను అందించబోతున్నారు బాలయ్య.

ప్రస్తుతం బాలయ్య తన 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో పాటు ఓ పాటను చిత్రబృందం విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు టాక్​.

మరో విశేషమేమిటంటే.. ఆ పాటను ఆలపించింది స్వయంగా బాలయ్యేనట. ఆయన గతంలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్‌' చిత్రం కోసం 'మామా ఏక్‌ పెగ్‌లా' అనే గీతాన్ని ఆలపించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి బోయపాటి చిత్రం కోసం గొంతు సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్‌ కూడా పూర్తయినట్లు సమాచారం. తాజాగా దీనికి గురించి బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చిన్న హింట్‌ ఇచ్చారు.

"త్వరలో మళ్లీ నా పాటతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేయబోతున్నా. దీనికి పెద్దగా సమయం కూడా తీసుకోవాలనుకోవట్లేదు. మరో నాలుగైదు రోజులంతే" అంటూ పాటపై క్లూ ఇచ్చారు బాలకృష్ణ. ఈ చిత్రం కోసం 'మోనార్క్‌' అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి : ముజఫర్​పుర్​ బాలుడ్ని దత్తత తీసుకున్న షారుక్​

ABOUT THE AUTHOR

...view details