తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల కుటుంబాల నుంచి వారసులు కథానాయకులుగా వచ్చి మెరుస్తుంటారు. మెగాస్టార్, అక్కినేని, నందమూరి ఫ్యామిలీల నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను.. తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నాడు బాలయ్య.
బాలయ్య తనయుడితో రాజమౌళి సినిమా? - latest cinema news
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో తెరకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
మోక్షజ్ఞకు సినిమాలంటే ఆసక్తి లేదని.. బిజినెస్ వైపు అడుగేస్తున్నాడంటూ ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. ఇందుకు సమాధానంగా వీలైనంత త్వరగా మోక్షజ్ఞ సినిమాల్లో చూస్తారని రూలర్ ప్రమోషన్స్‌లో బాలయ్య చెప్పుకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో తనయుడిని తెరకు పరిచయం చేయాలనుకుంటున్నాడట బాలయ్య.
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. జక్కన్నతోనే మోక్షజ్ఞ సినిమాను తీయాలని బాలకృష్ణ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిర్మాతగా బాలయ్యనే వ్యవహరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.