తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాను జయించిన జక్కన్న.. ప్లాస్మా దానానికి రెడీ

'బాహుబలి' దర్శకుడు రాజమౌళి కరోనాను జయించారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. తన కుటుంబ సభ్యులకూ వైద్య పరీక్షల్లో నెగిటివ్​ వచ్చినట్లు తెలిపారు. మరో మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తానని జక్కన్న స్పష్టం చేశారు.

Rajamouli
రాజమౌళి

By

Published : Aug 12, 2020, 6:14 PM IST

Updated : Aug 12, 2020, 6:22 PM IST

దర్శకధీరుడు రాజమౌళి సహా ఆయన కుటుంబం కరోనాను జయించారు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్​లో ఉన్న వారికి.. తాజాగా వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు.

ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు జక్కన్న. దీంతో పాటు వారు ప్లాస్మా దానం చేయడానికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. తద్వారా శరీరంలో యాంటీబాడీస్​ మరింత ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్​చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

ఇది చూడండి దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

Last Updated : Aug 12, 2020, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details