ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు బాబా సెహగల్ తండ్రి కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బాబా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. తన తండ్రితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ఆయన పంచుకున్నారు. ప్రతిఒక్కరూ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సంగీత దర్శకుడు బాబా సెహగల్‌కు పితృవియోగం - Baba Sehgal's Father dies
ప్రముఖ సంగీత దర్శకుడు బాబా సెహగల్ తండ్రి కరోనా సోకి మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని బాబా తెలపగా.. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
బాబా సెహగల్
ఆయన మృతి పట్ల అభిషేక్ బచ్చన్, గుల్షన్ దేవయ్య, వీర్ దాస్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాబా ఓ పాట కూడా పాడారు.
ఇదీ చూడండి:కరోనాపై ర్యాప్ సింగర్ బాబా సెహగల్ పాట