మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఏప్రిల్ 26న విడుదలవనుంది. ఈరోజు సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో రానాతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుడా హాజరయ్యారు.
'ఆఖరి శ్వాస వరకు పోరాడదాం' - avengers
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' తెలుగు చిత్రం ట్రైలర్ విడుదలైంది. భారీ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
అవెంజర్స్
చివరి శ్వాస వరకు పోరాడదామంటూ మార్వెల్ హీరోస్ అంటున్నారు. హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి.. 'దబాంగ్ సిరీస్లో మరిన్ని సినిమాలు వస్తాయి'