తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఐరన్​ మ్యాన్​'కు అక్షరాల రూ.500 కోట్లు...!

'అవెంజర్స్' సిరీస్​లో నటించిన రాబర్ట్​ డౌనీ జూనియర్(ఐరన్​మ్యాన్​), క్రిస్​ హేమ్స్​వర్త్​(థోర్), క్రిస్​ ఇవాన్స్​(కెప్టెన్ అమెరికా) భారీ పారితోషికాలు అందుకున్నట్లు సమాచారం. 'ఇన్ఫినిటీ వార్' చిత్రానికే  రాబర్ట్​ డౌనీ 75 మిలియన్ డాలర్లు(రూ. 521 కోట్లు) తీసుకున్నట్లు అంచనా.

అవెంజర్స్​

By

Published : May 2, 2019, 6:45 AM IST

'అవెంజర్స్​ ఎండ్​ గేమ్'​... ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. అవెంజర్స్​ సిరీస్​లో చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్​లో నటించిన హాలీవుడ్​ నటుల పారితోషికాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఐరన్​మ్యాన్​ పాత్ర పోషించిన రాబర్ట్​ డౌనీ జూనియర్ ఈ చిత్ర నిర్మాణ సంస్థ మార్వెల్​తో పెద్ద మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఎండ్​గేమ్​ ముందు చిత్రమైన 'అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్'​కు రాబర్ట్​ డౌనీ దాదాపు 75 మిలియన్ డాలర్లు(రూ. 521 కోట్లు) తీసుకున్నట్లు హాలీవుడ్​ వర్గాల అంచనా వేస్తున్నాయి. 2017లో వచ్చిన స్పైడర్​ మ్యాన్ చిత్రంలోను రాబర్ట్​ డౌనీ నటించాడు. ఈ సినిమా చిత్రీకరణలో మూడు రోజులే పాల్గొన్నాడు. ఇందుకుగాను రోజుకు 5 మిలియన్ డాలర్లు(రూ.34కోట్లు) తీసుకున్నాడు.

అవెంజర్స్​లో మిగతా పాత్రల్లో నటించిన క్రిస్​ హేమ్స్​వర్త్, క్రిస్​ ఇవాన్స్​, స్కార్లెట్ జాన్సన్​లు భారీ పారితోషికాలే స్వీకరించారు. థోర్ పాత్రను పోషించిన క్రిస్​ హేమ్స్​వర్త్ ఐదు చిత్రాలకు గాను మార్వెల్​తో 2010లోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కో సినిమాకు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు(రూ. 104 కోట్లు) తీసుకున్నాడు.

కెప్టెన్ అమెరికా పాత్రలో నటించిన క్రిస్​ ఇవాన్స్​ కూడా 15 నుంచి 20 మిలియన్​ డాలర్లు(104) తీసుకున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details