తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎదురు అడ్డేమున్నా.. అవెంజర్స్ ఆగరు' - ఏ ఏఆర్ రెహమాన్

హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగు యాంథమ్ విడుదలైంది. 'ఆగేది లేదు ఎదురే అడ్డేమున్నా' అంటూ సాగే ఈ పాటను ఏ ఆర్ రెహమాన్ పాడగా... రాకేందుమౌళి రాశాడు.

అవేంజర్స్

By

Published : Apr 9, 2019, 9:27 AM IST

అవెంజర్స్ ఎండ్​ గేమ్ తెలుగు యాంథెమ్ విడుదలైంది. ఏఆర్ రెహమాన్ స్వయంగా స్వరపరిచి, ఆలపించాడు. 'ఆగేది లేదు ఎదురే అడ్డేమున్నా..' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రాకేందు మౌళి సాహిత్యాన్నందించాడు. హైదరాబాద్​లో యాంథమ్​తో పాటు తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రానా, ఏ ఆర్ రెహమాన్ హాజరయ్యారు.

ఈ చిత్రం కోసం రెహమాన్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో యాంథమ్​ను సమకూర్చారు. ఈ సినిమాలో థానోస్​ పాత్రకు రానా తెలుగు డబ్బింగ్ చెప్పాడు. గత ఏడాది సంచలన విజయం సాధించిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్​కు సీక్వెల్​గా వస్తోందీ చిత్రం. అవెంజర్స్ సిరీస్​లో ఎండ్ గేమే చివరి సినిమా. ఏప్రిల్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details