తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అవెంజర్స్ ఎండ్​ గేమ్' ఎండ్ చాలా దూరం - actors

3 గంటల 2 నిమిషాల నిడివితో తెరకెక్కింది అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం. మార్వెల్ సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న సినిమాగా రికార్డు సృష్టించింది.

ఎవేంజర్స్

By

Published : Mar 28, 2019, 9:20 AM IST

అవెంజర్స్ ఎండ్ గేమ్.. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మార్వెల్​ స్టూడియోస్ ఇప్పటివరకు నిర్మించిన అన్ని చిత్రాలకంటే ఈ సినిమా నిడివి ఎక్కువ. 3 గంటల 2 నిమిషాల పాటు తెరపై సందడి చేయనుంది. దీని ముందు భాగం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం 2 గంటల 40 నిమిషాలుంది. ఆ సినిమా కంటే 'ఎండ్​ గేమ్' 22 నిమిషాలు ఎక్కువసేపు ప్రేక్షకులను అలరించనుంది. ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అవెంజర్స్ ఎండ్​ గేమ్​ చిత్రానికి ఆంటోని రసో, జోయ్ రసో సంయుక్తంగా దర్శకత్వం వహించారు. గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్​కు సీక్వెల్​గా తెరకెక్కిందీ చిత్రం. రాబర్ట్​ డౌనీ జూనియర్, క్రిస్​ ఇవాన్స్, మార్క్ రఫోలో, క్రిస్​ హేమ్స్​వర్త్​, స్కార్లెట్​ జాన్సన్, జెర్మీ రెన్నర్​, పాల్ రూడ్ లాంటి​ అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు.

ABOUT THE AUTHOR

...view details