తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akhanda review: 'అఖండ' సినిమా.. ఆడియెన్స్​ రియాక్షన్​ ఇదే! - అఖండ రివ్యూ

Akhanda movie review: బాలకృష్ణ 'అఖండ' సినిమా థియేటర్లలో విడుదలై దుమ్మురేపుతోంది. థియేటర్​ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు బాలయ్య నటన సహా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Balakrishna Akhanda movie
అఖండ మూవీ

By

Published : Dec 2, 2021, 1:22 PM IST

Updated : Dec 2, 2021, 1:31 PM IST

akhanda audience reaction: బోయపాటి-బాలకృష్ణ కాంబోలో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి! థియేటర్​లు బాలయ్య డైలాగ్​లతో దద్దరిల్లిపోతాయి. ఇప్పుడదే జోరును కొనసాగిస్తోంది వీరి కాంబినేషన్​లో వచ్చిన కొత్త సినిమా 'అఖండ'. నేడు(గురువారం) విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలలు వేయిస్తూ సూపర్​హిట్​ టాక్​ను సొంతం చేసుకుంది. థియేటర్​ నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకులు.. 'సినిమా అదిరిపోయింది' అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూత్​, ఫ్యామిలీ ప్రతిఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, బాలయ్య నటన, గెటప్​ సూపర్​ అంటూ ఈలలు వేస్తున్నారు. శ్రీకాంత్​, జగపతిబాబు నటన కూడా అదిరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా 'జై బాలయ్య పాట', అఖండ పాత్రలో బాలయ్య నటన, సంగీత దర్శకుడు తమన్​ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు అదిరిపోయే రెస్పాన్స్​ వస్తుంది. సంక్రాంతి పండగ ముందే వచ్చేసిందని అంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్​ థియేటర్స్​ బయట టపాసులు కాలుస్తూ పండగ చేసుకుంటున్నారు.

అఖండ రివ్యూ

కొంతమంది ప్రేక్షకులు చెప్పిన మాటలు

'బాలయ్య నటన, గెటప్​, డైలాగ్స్​, డ్యాన్స్​, ఫైట్​ అదిరిపోయాయి', 'అఘోర' యాక్షన్​ అదిరిపోయింది, 'సినిమా మళ్లీ చూడాలనిపిస్తుంది' అని ప్రేక్షకులు అంటున్నారు.

"మూవీ బ్లాక్​బాస్టర్​ హిట్​. కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి చాలా పెద్ద హిట్​ వచ్చింది. ఎంతో హ్యాపీగా ఉంది. థియేటర్​లో ఖాళీ లేదు. అంతకుముందు బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వచ్చిన సినిమాలకు దీటుగా ఉంది. ఫుల్​ ఎంజాయ్​ చేస్తారు."

-ఓ ప్రేక్షకుడు.

"గూస్​ బంప్స్​ వస్తున్నాయి. బాలయ్య డైలాగ్​ డెలివరీ అదిరిపోయింది. ఈ 20ఏళ్లలో థియేటర్​ దగ్గర బాలయ్య సినిమాకు ఇంతమందిని చూడలేదు."

-ఓ లేడీ ఫ్యాన్​.

"చాలా ఎమోషన్​గా ఉంది. నాకు మంచి వేషం ఇచ్చారు. సినిమా సూపర్​ డూపర్​ హిట్​. సింహ, లెజెండ్​కు మించిన సినిమా. అఖండ క్యారెక్టర్​ చాలా అబ్బురపరిచింది. శ్రీకాంత్​ గారి క్యారెక్టర్​ అదిరిపోయింది."

-ఈ సినిమాలోని నటుడు.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. విలన్​గా శ్రీకాంత్ నటించారు. పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి:

Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్​ రివ్యూ

జయహో అఖండ... అభిమానుల పూనకాలతో థియేటర్లు ఊగిపోతున్నాయ్!

Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్​ రివ్యూ

Last Updated : Dec 2, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details