షారుఖ్ ఖాన్ తర్వాతి సినిమా ఎవరితోనో ఖరారైందట. పదినెలల నుంచి ఏ చిత్రాన్ని ఒప్పుకోని కింగ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీతో పనిచేయనున్నాడని.. 'విజిల్' ప్రమోషన్ ఈవెంట్కు హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపాడు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించిన దర్శకుడు అట్లీ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది.
"షారుఖ్ అంటే గౌరవం ఉంది. ఆయనకు కూడా నా పనితనం ఇష్టం. త్వరలోనే మా ఇద్దరి కలయికలో సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.