'కెజీయఫ్' తరువాత కన్నడ పరిశ్రమ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ 'అతడే శ్రీమన్నారాయణ'. ఈ ఏడాది కన్నడంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు రక్షిత్ శెట్టి హీరోగానే కాకుండా రచయితగాను పనిచేశాడు. ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు తగ్గట్టే ట్రైలర్‌ని కూడా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా కన్నడలో విడుదలై విజయవంతం అయ్యింది.
గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీమన్నారాయణ!
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ'. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని దేశంలోని ఇతర భాషల్లో విడివిడిగా విడుదల చేయటానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీ అంటే అన్ని భాషల్లో ఒకే సారి విడుదలవ్వాలి. కాని ఇందుకు పూర్తి భిన్నంగా ఒక్కో భాషలో ఒక్కో సారి విడుదలవుతుందీ చిత్రం. జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు, తమిళం, మలయాళంలో 3న, చివరిగా జనవరి 17న హిందీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ తూటాల పోలీస్. కన్నడంలో విడుదలైన ఈ సినిమా మూడు గంటలు రన్ టైమ్ ఉన్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో మిగతా పరిశ్రమల్లోను అంచనాలు పెరిగాయి. అత్యధిక కలెక్షన్లు వచ్చే బాలీవుడ్‌లో మరీ గ్యాప్ ఇచ్చి విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇలా విడుదల విషయంలో గ్యాప్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు 'అతడే శ్రీమన్నారామణ'. ఈ చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రం ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి:- ముద్దు సన్నివేశాలకు సిద్ధమయ్యా కానీ!