తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వచ్చే నెల నుంచే 'అసురన్' రీమేక్​ చిత్రీకరణ? - ASURAN REMAKE NEWS

హీరో వెంకటేశ్​ నటించనున్న 'అసురన్' రీమేక్ షూటింగ్​ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుందట. వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

హీరో వెంకటేశ్
హీరో వెంకటేశ్

By

Published : Dec 9, 2019, 6:00 PM IST

విక్టరీ వెంకటేశ్ నటించిన 'వెంకీమామ' విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత 'అసురన్' రీమేక్​లో నటించనున్నాడీ హీరో. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్​ కోసం పక్కా ప్రణాళికతో చిత్రబృందం సిద్ధమవుతోందట.

అందుతున్న సమాచారం మేరకు జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. వేసవిలో విడుదల చేయనున్నారట. సురేశ్​బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఇది చదవండి: 'అసురన్​'లో వెంకీ సరసన శ్రియ..!

ABOUT THE AUTHOR

...view details