సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంతో హిట్ జంటగా నిలిచారు రామ్ చరణ్, సమంత. చిట్టిబాబుగా చెర్రీ, రామలక్ష్మిగా సామ్ పోటీపడి మరీ నటించారు. ఈ చిత్రంలో వీళ్లద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటించనుందని చిత్రసీమలో వస్తోన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా విశ్వసనీయ వర్గాలు దాదాపు ఖరారు అంటున్నాయి. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత కూడా నటించనుందని తెలుస్తోంది.