తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్'.. మాకు ఓ కొత్త అనుభవం - radhe shyam news

గతంలో చాలా పీరియాడిక్ సినిమాలకు పనిచేసినా.. 'రాధేశ్యామ్' కొత్త అనుభవాన్నిచ్చిందని చెప్పారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్.

art director ravinder about radhe shyam movie
art director ravinder

By

Published : Sep 10, 2020, 6:36 AM IST

"సహజంగానే మా విభాగానికి నిత్యం సవాళ్లే. వీటికితోడు కరోనా మరిన్ని కష్టాల్ని తీసుకొచ్చింది. అయినా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం" అని ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అంటున్నారు. 'మగధీర', 'ఈగ'తో పాటు గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇటీవలే విడుదలైన 'వి'కి ఆయనే ప్రొడక్షన్ డిజైనర్. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్'తో పాటు వరుణ్​తేజ్ చిత్రానికి చేస్తున్నారు.

'రాధేశ్యామ్' కోసం హైదరాబాద్​లో యూరప్​ నేపథ్యాన్ని ప్రతిబింబించే సెట్స్​ను తీర్చిదిద్దుతున్నారు. అందులోనే త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఇదివరకు పీరియాడిక్ సినిమాలు చాలానే చేశా కానీ, దానితో పోలిస్తే ఇది చాలా విభిన్నమని చెబుతున్నారు. గురువారం ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా 'ఈనాడు'తో మాట్లాడారు.

"పీరియాడిక్ చిత్రం అంటే శతాబ్దాల కిందటి కథేమీ కాదు. 1970ల కాలంలో, యూరప్​ నేపథ్యంలో సాగుతుంది. ఆ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ తీర్చిదిద్దడం కొత్త అనుభవం. కరోనా ప్రభావం వల్ల పరిమిత సంఖ్యలో వర్కర్లను వినియోగిస్తూ, అడుగడుగునా జాగ్రత్తలు పాటిస్తున్నాం. కరోనా తర్వాత అన్ని విషయాల్లో మరింత క్రమశిక్షణ పెరిగింది. భారీ వ్యయంతో తెరకెక్కే చిత్రాలకు కావాల్సినన్ని వనరులు ఉంటాయి చిన్న చిత్రాలకు మాత్రం అన్నీ అరకొరే. పెద్ద చిత్రాలకు పనిచేసిన అనుభవాన్ని చిన్న చిత్రాల కోసం వినియోగిస్తుంటాం. ప్రస్తుతం యువీ క్రియేషన్స్​లో ఓ సినిమా చేస్తున్నాను. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాతో ప్రయాణం చేయడమే నాకు ఇష్టం" -రవీందర్, ప్రొడక్షన్ డిజైనర్

ABOUT THE AUTHOR

...view details