నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ మరోసారి వాయిదా పడింది. ఇటీవల ప్రకటించినట్లు మే 1న సినిమా విడుదల కావడం లేదని చిత్రబృందం తెలిపింది.
ఈసారి పక్కా అన్నారు.. మళ్లీ పక్కకు వెళ్లారు - అవెంజర్స్ ఎండ్ గేమ్
హీరో నిఖిల్ జర్నలిస్ట్‌గా కనిపించనున్న 'అర్జున్ సురవరం' మళ్లీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని కొద్ది రోజుల్లో చెపుతామని ట్విట్టర్లో తెలిపాడీ కథానాయకుడు.
హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ రిలీజ్ దృష్ట్యా ఈ సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి. మే 2వ వారంలో మహేశ్‌బాబు ‘మహర్షి’ రానుంది. ఈ కారణంతో చిత్రాన్ని కొన్ని వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు నిఖిల్. ట్రైలర్ విడుదలనూ ఆపేశారు.
‘కిరాక్ పార్టీ’ తర్వాత నిఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. తమిళ హిట్ మూవీ ‘కనితన్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో హీరో కనిపించనున్నాడు.