తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దు సీన్​తో అర్జున్ రెడ్డి 2.0కు ముగింపు - banitha sandhu

ధ్రువ్​ కుమార్, బనితా సంధు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఆదిత్య వర్మ'. అర్జున్ రెడ్డికి రీమేక్​గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ముద్దుసన్నివేశంతో గుమ్మడికాయ కొట్టింది చిత్రబృందం

ఆదిత్యవర్మ

By

Published : Jul 20, 2019, 11:19 AM IST

మేకింగ్ వీడియోలో ధ్రువ్ కుమార్, బనితా

అర్జున్ రెడ్డి.. ఘాటైన అదరచుంబనాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాకు తమిళ రీమేక్​గా రూపొందుతున్న ఆదిత్య వర్మలోనూ ఇలాంటి ముద్దుసీన్లే ఉన్నట్టున్నాయి. ఇందుకు తగినట్టుగానే ముద్దు సన్నివేశంతోనే షూటింగ్ పూర్తి చేసింది చిత్రబృందం. సంబంధిత మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

హీరోయిన్ బనితా నుదుటిపై ధ్రువ్ ముద్దుపెట్టుకునే సన్నివేశం వీడియోలో ఉంది. నటీనటులు, చిత్రబృందంతో పాటు హీరో విక్రమ్​ ఇందులో కనిపించారు. బాలా దర్శకత్వంలో ఇంతకు ముందే సినిమాను తెరకెక్కించగా.. కథ విషయంలో విభేదాల కారణంగా నిర్మాతలు చిత్రాన్ని మళ్లీ రీ షూట్ చేశారు.

అర్జున్​ రెడ్డికి పనిచేసిన గిరిసాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా ఆనంద్ కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: చైతూ-సామ్​లో ముందు ఎవరు ప్రేమలో పడ్డారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details