తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మలైకా అంటే అందుకే ఇష్టం: అర్జున్ - మలైకా అరోరా

బాలీవుడ్​ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా గురించి స్పందించాడు అర్జున్.

Malaika, Arjun
మలైకా, అర్జున్

By

Published : Apr 26, 2021, 4:40 PM IST

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సీనియర్ నటి మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. వీరికి నిశ్చితార్థం కూడా అయినట్లు పుకార్లు వచ్చాయి. తాజగా తన ప్రేయసి మలైకా గురించి స్పందించాడు అర్జున్. మలైకా స్వతంత్రంగా ఉంటూ గౌరవప్రదంగా బతకడం తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మలైకాలో ఏమంటే ఇష్టమని అడగగా స్పందించాడీ హీరో.

"మలైకాకు ఉన్న గౌరవం నాకిష్టం. 20 ఏళ్ల వయసు నుంచి ఇప్పటివరకు స్వతంత్రంగా జీవిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుంది. తన పనే సమాధానం చెప్పాలని భావిస్తుంది. ప్రతిరోజూ తన నుంచి ఎంతో నేర్చుకుంటూనే ఉంటా."

-అర్జున్ కపూర్, నటుడు

ప్రస్తుతం అర్జున్ కపూర్.. 'సర్దార్ కా గ్రాండ్​సన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రకుల్​ప్రీత్ సింగ్ హీరోయిన్. మే 18న నెట్​ఫ్లిక్స్​లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రొమాంటిక్ థ్రిల్లర్ 'ఏక్ విలన్ రిటర్న్'​లోనూ హీరోగా నటించనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details