తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అర్జున్​కు నెల తర్వాత కరోనా నెగెటివ్ - arjun kapoor malaika arora

దాదాపు నెల రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు హీరో అర్జున్ కపూర్. షూటింగ్​లకు వెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు.

Arjun Kapoor recovers from COVID-19, 'excited to return to work'
హీరో అర్జున్ కపూర్

By

Published : Oct 7, 2020, 4:53 PM IST

"కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి" అని బాలీవుడ్ హీరో అర్జున్‌ కపూర్‌ చెప్పారు. కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ఇదే విషయాన్ని చెబుతూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టారు.

"హాయ్‌ నేను వారాంత పరీక్షలు చేయించకున్నాను. కరోనా నెగెటివ్‌గా వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు చాలా బాగున్నాను. తిరిగి మళ్లీ పనిచేయడానికి సిద్ధమైనందుకు సంతోషం. నేను కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వైరస్‌ చాలా తీవ్రమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా అందరినీ ప్రభావితం చేస్తుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. యువకులు, వృద్దులు తేడా లేకుండా దయచేసి మాస్క్ ధరించండి. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న కరోనా వారియర్స్ వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు. మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని అర్జున్ చెప్పారు.

సెప్టెంబరు 6న అర్జున్​ కపూర్​కు కరోనా పాజిటివ్‌గా తేలింది. సరిగ్గా నెల తర్వాత ఈ వైరస్​ నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. అతడితో పాటే ప్రేయసి మలైకా అరోరాకు కొవిడ్ బారిన పడి కోలుకుంది.

ప్రస్తుతం అర్జున్‌, 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చిత్రంలో నటిస్తున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. త్వరలోనే విడుదల కానుందీ సినిమా. గతేడాది 'ఇండియాస్‌ మోస్ట్ వాంటెడ్‌' చిత్రంలో అలరించారు.

ABOUT THE AUTHOR

...view details