ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా).. 'బ్రేక్ త్రూ ఇనిషియేటివ్'కు అంబాసిడర్‌గా రెహమాన్‌ను నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో భారత్‌లోని గొప్ప కళాకారులను గుర్తించేందుకు రెహమాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా బాఫ్టా ఎంపిక చేసింది. ఈ గౌరవం దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
"బాఫ్టాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలు, టీవీ, ఆట.. ఇలా పలు రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచే వారిని గుర్తించేందుకు ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని ప్రతిభావంతులైన కళాకారులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురుచూసున్నాను. ప్రతిభావంతులను గుర్తించి, సంబంధాలు పెంచడమే కాకుండా బాఫ్టా అవార్డు విజేతలు, నామినేషన్ దక్కించుకున్న వాళ్లకు మెంటర్‌గానూ వ్యవహరిస్తాను"