చిన్న వయసులోనే ఘన విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు అట్లీ. షారుక్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం శంకి (వర్కింగ్ టైటిల్)పేరుతో రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్.రెహమాన్ అయితే బాగుంటుందని అట్లీ భావిస్తున్నారట. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో షారుక్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. అందులో ఒకటి పోలీస్ అధికారిగా కాగా.. మరొకటి క్రిమినల్ పాత్ర.
షారుక్- అట్లీ సినిమాకు రెహమాన్ సంగీతం! - ఏ ఆర్ రెహమాన్ షారుక్ అట్లీ
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్- తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కాంబోలో రానున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
షారుక్- అట్లీ
షారుక్ 2018లో విడుదలైన 'జీరో' చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు. దీంతో అట్లీ తెరకెక్కించబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదీ చూడండి షూటింగ్ రీస్టార్ట్: బీచ్ దగ్గర రాఖీభాయ్.. పొలంలో శర్వానంద్