తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా పెళ్లి గురించి అంత చర్చ ఎందుకు? : అనుష్క - tollywood news

తన పెళ్లి గురించి ఎందుకంత చర్చ చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పింది హీరోయిన్ అనుష్క. గురువారం జరిగిన ఓ ఈవెంట్​లో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకుంది.

నా పెళ్లి గురించి అంత చర్చ ఎందుకు? : అనుష్క
హీరోయిన్ అనుష్క

By

Published : Mar 13, 2020, 11:43 AM IST

హీరోయిన్ అనుష్క పెళ్లి త్వరలో జరగనుందంటూ, గత కొన్ని వారాల నుంచి ఒకటే వార్తలు. ఈమెను వివాహం చేసుకోబోయేది ఓ టీమిండియా క్రికెటర్​ అని, విడాకుల తీసుకున్న టాలీవుడ్​ దర్శకుడు ఆమెను వివాహం చేసుకోనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఈ పుకార్లు అన్నింటికీ పుల్​స్టాప్ పెట్టింది స్వీటీ. గురువారం జరిగిన ఓ ఈవెంట్​లో ఈ విషయం గురించి పూర్తి స్పష్టతనిచ్చింది.

నిశ్శబ్దం సినిమాలో హీరోయిన్ అనుష్క

"ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ అబద్ధం. నా పెళ్లి గురించి ఎందుకంత చర్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరైనా రిలేషన్​షిప్​ను దాయరు కదా. పెళ్లి గురించి ఎలా దాస్తానని అనుకున్నారు. అందరిలానే వివాహం అనేది నా జీవితంలోనూ ప్రత్యేకమే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నేనే మీకు చెప్తా" -అనుష్క శెట్టి, హీరోయిన్

'బాహుబలి' సిరీస్, 'భాగమతి' తర్వాత ఆమె నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. ఇటీవలే వచ్చిన ట్రైలర్​ అంచనాల్ని పెంచుతోంది. వచ్చే నెల​ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details