తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అలాంటి చోటు‌కు తీసుకెళ్తే చ‌చ్చిపోతానేమో' - Anushka fear the highest places

సినిమాల్లో ఎన్నో ధైర్యవంతురాలి పాత్రలు పోషించిన స్టార్ హీరోయిన్​ అనుష్క.. చిన్నప్పటి నుంచి తనలో ఓ భయం ఉండిపోయిందని చెప్పింది. ఇంతకీ ఆ భయం ఏంటంటే?

Anushka
అనుష్క

By

Published : Nov 24, 2020, 5:30 AM IST

కథానాయిక ప్రాధాన్య పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది హీరోయిన్​ అనుష్క. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన సినీ కెరీర్​లో చేసిన అతిపెద్ద సాహసం గురించి చెప్పింది. ఆ విషయాన్ని ఓ సారి నెమరువేసుకుందాం.

"'అరుంధతి', 'బాహుబలి', 'భాగమతి' లాంటి నాయికా ప్రాధాన్య చిత్రాల కోసం కత్తి యుద్ధాలు నేర్చుకున్నా. గుర్రపు స్వారీలు చేశా. ఇవన్నీ నాకు గొప్ప సాహసాలే. కానీ, నేను జీవితంలో చేసిన అతి పెద్ద సాహసమంటే 'బిల్లా' చిత్రాన్నే గుర్తు చేసుకోవాలి' అని వివరించింది.

"'బిల్లా' సినిమాలో నేను చాలా ఎత్తు నుంచి దూకే సన్నివేశం ఒకటుంది. దర్శకుడు తొలుత నాకు ఆ సన్నివేశం గురించి చెప్పినప్పుడు ఏదోలా పూర్తి చేసేద్దాంలే అనుకున్నా. కానీ, షాట్‌ పూర్తవ్వగానే నాకు కళ్లు తిరిగినంత పనైంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఆ భయాన్ని ఎప్పుడో ఒకప్పడు వదిలించుకోక తప్పదు. అందుకే 'బిల్లా'లో సీన్‌ కోసం ప్రయత్నించా. కానీ, అది బెడిసి కొట్టినట్లే అనిపించింది. అందుకే మళ్లీ ఈ తరహా సాహసమెప్పుడూ చెయ్యలేదు. చాలా మంది కొండల పైనుంచి బంగీ జంప్‌ చేస్తుంటారు. నిజంగా నన్నలాంటి చోట్లకు తీసుకెళ్తే చచ్చిపోతానేమో అనిపిస్తుంటుంది." అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది స్వీటీ.

ఇదీ చూడండి 'సర్కారు వారి పాట'లో బ్యాంకు మేనేజర్​గా అనుష్క!

ABOUT THE AUTHOR

...view details