బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం కథానాయికల ఎంపిక చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా తెలుగు నటి అంజలిని ఎంపిక చేసినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. గతంలో బాలయ్యతో కలిసి అంజలి 'డిక్టేటర్' చిత్రంలో ఆడిపాడింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది - Anjali romance with Balakrishna
నందమూరి హీరో బాలకృష్ణ కొత్త చిత్రంలో నటించే ఓ హీరోయిన్‌పై క్లారిటీ వచ్చింది. మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు.
బాలయ్య
మరో నాయికగా శ్రియను తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వారణాశిలో చిత్రీకరణ మొదలు కానుంది.
Last Updated : Mar 2, 2020, 7:02 AM IST