హాస్యాన్ని ప్రధానాంశంగా ఎంచుకొని దానికి ఎన్నో వినూత్నమైన కథాంశాలు జోడించి విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
తాజాగా అనిల్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది. దాని విలువ దాదాపు రూ.12కోట్లు అని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.